- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ జానకి
by Ratna Kumari |
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా అక్టోబర్ 01 నుంచి అక్టోబర్ 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్-1861

X
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా అక్టోబర్ 01 నుంచి అక్టోబర్ 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీ లు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, ప్రభుత్వ, ప్రజా ఆస్తులు, ధననష్టం కలిగించే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని ఎస్పీ పేర్కొన్నారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధింత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ జానకి హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీస్ విభాగానికి సహకరించవలసినదిగా ఆమె విజ్ఞప్తి చేశారు.
Next Story






