- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ జానకి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నవంబర్ 1 నుండి 30 వరకు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి తె

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నవంబర్ 1 నుండి 30 వరకు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. జిల్లా ప్రజలు,ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో లు, నిరసనలు, సభలు, సమావేశాలు, పబ్లిక్ మీటింగులు నిర్వహించరాదని ఆమె తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని ఆమె ఆదేశించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధింత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ జానకి హెచ్చరించారు.
ప్రతి విద్యార్థి బాధ్యతాయుత పౌరుడిగా ఎదగాలి..
ప్రతి విద్యార్థి బాధ్యతాయుత పౌరుడిగా ఎదగడం సమాజ అభివృద్ధికి కీలకమని ఉమెన్స్ పీఎస్ సీఐ శ్రీనివాసులు అన్నారు. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు శనివారం స్థానిక గవర్నమెంట్ ఐటిఐ కాలేజ్ ఫర్ బాయ్స్ నందు నిర్వహించిన 'ప్రజా భద్రత-పోలీస్ బాధ్యత' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, చట్ట విరుద్ధ చర్యలను గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అంతకుముందు కళా బృందం సభ్యులు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, చైల్డ్ ట్రాఫికింగ్,ఈవ్ టీజింగ్, మత్తు ప్రమాదాలపై సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్దులను అవగాహన కల్పిస్తూ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సభ్యులు,షీ టీం సభ్యులు పాల్గొన్నారు.






