ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అధిక పెన్ష‌న్ అమలు చేయండి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అధిక‌ పెన్షన్ ను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అధిక పెన్ష‌న్ అమలు చేయండి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు అధిక‌ పెన్షన్ ను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ బర్కత్ పుర లోని కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం కమీషనర్-1 శివకుమార్ ను కలిసి ఆయన విన్నతీ పత్రాన్ని సమర్పించారు. అధిక‌ పెన్షన్ అమలు కై జారీ చేసిన డిమాండ్ లేఖలపై లక్షలాది రూపాయలు డీడీ ల రూపంలో కమీషనర్ పేర సమర్పించి సంవత్సర కాలం దాటిపోయిందని, పెన్షన్ రాక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని ఆయన కోరగా, అందుకు కమీషనర్ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అనంతరం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజేంద్రబాబు డైరీ, క్యాలెండర్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర కోశాధికారి సయ్యద్ ఫరీద్, జిల్లా కమిటీ నాయకుడు బొక్క నర్సింహులు పాల్గొన్నారు.

Next Story