అక్ర‌మంగా మ‌ద్యం అమ్మితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

by Ratna Kumari |

అక్ర‌మంగా మ‌ద్యం అమ్మితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ జె.వెంకట్ రెడ్డి హెచ్చ‌రించారు.

అక్ర‌మంగా మ‌ద్యం అమ్మితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
X

దిశ, చారకొండ : అక్ర‌మంగా మ‌ద్యం అమ్మితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ జె.వెంకట్ రెడ్డి హెచ్చ‌రించారు. శ్రీ సీతారామ చంద్ర స్వామి శిర్సనగండ్ల బ్రహ్మోత్సవాల నిర్వహణ లో భాగంగా చారకొండ మండల కేంద్రం, శిర్శనగండ్ల గ్రామాలలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కల్వకుర్తి సర్కిల్ పరిధిలోని అధికారులు నాటు సారా తయారీ స్థావరాలపై మంగ‌ళ‌వారం దాడులు నిర్వహించారు. దాదాపు నాలుగు వందల లీటర్ల బెల్లం పానకం, ఇరవై లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నాటు సారా, కల్తీ కల్లు, అక్రమంగా మద్యం విక్రయాలు జరిపే వ్యక్తులపై చట్ట ప్రకారం.. కఠిన చర్యలు తీసుకుంటామని, ఉత్సవాలలో మద్యం విక్రయాలు జరిపితే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ జె.వెంకట్ రెడ్డి, చారకొండ ఎస్సై వీరబాబు , నాగర్ కర్నూల్ డీటీఎఫ్ ఎస్సై అరుణా, ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్సై జబ్బార్, సిబ్బంది మహేష్, నార్య, కృష్ణ వేణి, కృష్ణా రెడ్డి, చిన్న ఈ దాడులలో పాల్గొన్నారు.

Next Story