- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరిహద్దులో అక్రమ ధాన్యం రవాణా కలకలం
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కేటిదొడ్డి మండలంలో నందిన్నె చెక్‌పోస్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది.

దిశ, గట్టు: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కేటిదొడ్డి మండలంలో నందిన్నె చెక్‌పోస్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది. అనుమతులు లేకుండానే పీడీఎస్ బియ్యం, సీఎంఆర్ వరి ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానంతో స్థానికులు చెక్‌పోస్టు వద్ద వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో డ్రైవర్లు వాహనాలను గ్రామస్థులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.
చెక్‌పోస్టులో అప్పటికే సిబ్బంది కనీసంగా ఉండటం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేసింది. వాహనాల్లో ఉన్న బియ్యం, ధాన్యం అనుమానాస్పదంగా రాయచూర్ వైపు తరలించడంతో పీడీఎస్ సరఫరాలో అవకతవకలు జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక లారీ రాయచూర్‌కు వెళ్లినట్లు సమాచారం కాగా, మరో ధాన్యలారీని తిరిగి అదే మండలంలోని ఓ రైస్ మిల్లుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
గ్రామస్థులు ఈ ఘటనపై కేటిదొడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందిన్నె రైస్ మిల్లులో అక్రమంగా ధాన్యం నిల్వ చేసి తరలిస్తున్నారన్న ఆరోపణలతో పాటు, తమపై వాహనాల దాడి ప్రయత్నం జరిగిందని వారు పేర్కొన్నారు. మిల్లును తనిఖీ చేసి, పాలుపంచుకున్నవారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సివిల్ సప్లయ్ అధికారులు, పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలన్నది ప్రజల ఆవేదనగా మారింది.






