15 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే కిలో కూడా దిగుబడి రాలే..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-14 12:34:27  IST  )

దిశ‌, అలంపూర్ : మిర్చి పంట దిగుబ‌డి రాక రైతులు క‌న్నీరు మున్నీర‌య్యాడు. వంద‌లాది ఎక‌రాల్లో పంట‌ను పండించాల‌ని రైతులు మిర్చి పంట‌ను వేశారు. పంట దిగుబ‌డి రాక పంట‌ను

15 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే కిలో కూడా దిగుబడి రాలే..!
X

దిశ‌, అలంపూర్ : మిర్చి పంట దిగుబ‌డి రాక రైతులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. వంద‌లాది ఎక‌రాల్లో పంట‌ను పండించాల‌ని రైతులు మిర్చి పంట‌ను వేశారు. పంట దిగుబ‌డి రాక వేసిన పంట‌ను తొల‌గిస్తున్నారు. ఇటీవ‌ల వంద‌ల ఎక‌రాల్లో పంట‌ను తొల‌గిస్తున్న రైతులు అనే క‌థ‌నం దిశ ప‌త్రిక‌లో రావ‌డంతో తాజాగా వ్య‌వ‌సాయ శాఖ అధికారులు స్పందించారు. వివ‌రాల్లోకి వెల్లితే.. మాన‌న‌వ‌పాడు మండ‌ల కేంద్రంలోని 10 ఎక‌రాల్లో శ్రీకాంత్ రెడ్డి సాగు చేసిన మిర్చిని తొల‌గించారు. అలాగే సూర్య నారాయ‌ణ రెడ్డి 15 ఎక‌రాల్లో మిర్చి పంట‌ను సాగు చేశాడు. ఒక్క కిలో దిగుబ‌డి కూడా రాలేదు. అయితే పంట దిగుబ‌డి రాక పంట‌ను తొల‌గించారు. అధిక వర్షాలు రావ‌డంతో మిర్చి పంట‌కు బూడిద తెగులుతో పాటు.. తల్లి వేరు పూర్తిగా కోల్పోయింది. దీంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. రైతులు నష్టపోయిన విషయాన్ని అధికారులు తెలుసుకున్నారు. ఎక‌రా మిర్చి పంట‌కు సుమారు రూ.1ల‌క్ష వ‌ర‌కు ఖ‌ర్చు చేశామ‌ని.. ఒక్క కిలో మిర్చి కూడా రాలేద‌ని అధికారుల‌కు స‌మ‌స్య‌ను వివ‌రించారు రైతులు.

శాస్త్ర‌వేత్త‌ల‌ను పిలిపిస్తాం : వ్వ‌య‌సాయ అధికారి సందీప్

ప‌రిశీలించేందుకు విచ్చేసిన వ్య‌వ‌సాయ అధికారి సందీప్ మాట్లాడుతూ మిర్చి పంట‌లో భారీగా న‌ష్ట‌పోయిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని.. అధిక వర్షాలు కురవడంతో మిర్చి పంట ఎలాంటి దిగుబడి రాలేద‌ని తెలిపారు. పంట దిగుబ‌డి రాక రైతులు పంటను పూర్తిగా తొలగించుకుంటున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులకు సమాచారం చేర‌వేస్తామ‌ని తెలిపారు. అలాగే శాస్త్రవేత్తలను పిలిపించి తొలగించిన పంటలను ప‌రిశోధ‌న కోసం పంపిస్తామ‌ని తెలిపారు. న‌ష్ట‌పోయిన రైతుల జాబితాను అధికారుల‌కు నివేదిక అందిస్తామ‌ని తెలిపారు. మిర్చితో పాటు ప‌త్తి, కంది, రైతులు కూడా న‌ష్ట‌పోయిన‌ట్టు త‌మ దృష్టికి తీసుకొచ్చార‌ని వెల్ల‌డించారు.

Next Story