- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికలను సీనియర్స్ పేరుతో ర్యాగింగ్ కు పాల్పడితే చర్యలు
దిశ, పెద్దకొత్తపల్లి : సీనియర్స్ పేరుతో జూనియర్స్ విద్యార్థుల పట్ల ర్యాగింగ్ కు పాల్పడితే చట్టపరంగా శిక్షకు గురవుతారు.

దిశ, పెద్దకొత్తపల్లి : సీనియర్స్ పేరుతో జూనియర్స్ విద్యార్థులను, విద్యార్థినిల పట్ల ర్యాగింగ్ కు పాల్పడితే చట్టపరంగా శిక్షకు గురవుతారని కొల్లాపూర్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్, శరణ్య హెచ్చరించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు కొల్లాపూర్ మండల న్యాయ సేవా అధికార సంఘం ఆధ్వర్యంలో పెద్దకొత్తపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు కి ఆమె ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు మీ చదువును మీరు ఏ రంగంలో వెళ్లదలచుకున్నారో ఆ సబ్జెక్టులను ప్రణాళికాబద్ధంగా నిర్దేశించుకొని లక్ష్యం సాధించే దిశగా ప్రయాణించాలని పిలుపునిచ్చారు. బాలికలను సీనియర్ల పేరుతో ర్యాగింగ్ చేయడం పెద్ద నేరమని, అలా ర్యాగింగ్ కు పాల్పడితే వారు చట్టం ప్రకారం శిక్షారులు అవుతారని తెలిపారు. బాలికలు సెల్ ఫోన్లు తమ చదువులో భాగంగా ఉపయోగపడే విధంగా వాడుకోవాలి.. తప్ప వేరే తప్పుడు మార్గంలో ఉపయోగించుకోవద్దని, బాల్య వివాహాల నిర్మూలనకు తమ వంతు కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ మధ్య చాలా పోక్సో కేసులు నమోదవుతున్నాయని, పోక్సో బాధితులుగా బాలికలు గురికాకుండా గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి అవగాహన కలిగి స్వీయ రక్షణ కొరకు కరాటే వంటి పోరాట పటిమ సాధన కలిగివుండాలని ఆమె స్పష్టం చేశారు.
అందుకు విద్యార్థినులు మాకు విద్యాలయం నిర్వాహకులు కరాటే శిక్షణ ఇస్తున్నారని, తాము అందులో నైపుణ్యం పొందుతున్నామని న్యాయమూర్తికి తెలిపారు. ఈ సదస్సుకు హాజరైన బార్ అధ్యక్షులు పోతుల నాగరాజు మాట్లాడుతూ బాలికలు రక్షణ చట్టాలపై అవగాహన కలిగివుండాలని, మహిళలకు అన్ని రంగాలలో, ఉద్యోగాలలో రిజర్వేషన్ విధానం ఉన్నదన్నారు.మీరు నిర్దేశించుకున్న వాటిలో అట్టి రిజర్వేషన్ సౌకర్యంతో లబ్ది పొందాలని తెలిపారు. న్యాయవాది వి. మధుసూదన్ రావు బాలికల అక్షరాస్యత పెంపొందాలని, బాలికలు వారికి ఏమైనా సమస్యలు వస్తే తల్లితండ్రులకు, అధ్యాపకులకు తెలియజేయాలన్నారు. బాలికల రక్షణ కొరకు చాలా చట్టాలు ఉన్నాయని బాలికలకు సూచించారు. న్యాయవాది యం.డి. ముబీన్ బాల్య వివాహాలు, ఆన్లైన్ బెట్టింగ్ లు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, పంపే మెసేజ్ లు, వీడియోలు డిలీట్ చేసినా సైబర్ నేరస్థులు వాటిని సేకరించి బ్లాక్మెయిల్ చేసే ఆస్కారం ఉంటుందని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సదస్సులో స్థానిక సర్పంచ్ బెట్టరీ రేణుక నాగరాజు దంపతులను నిర్వాహకులు శాలువా కప్పి సన్మానం చేశారు. విద్యాలయం ఎస్.ఓ. వి.ఎస్ . ప్రమీల, శ్రీలత, బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్.ఐ. వి. సతీష్, కోర్టు సూపరింటెండెంట్లు అజయ్ కుమార్, శ్రీనివాసులు, కోర్టు పోలీసు కానిస్టేబుల్ రాముడు, లోక్ అదాలత్ సిబ్బంది భోగ హరికృష్ణ, గ్రామస్థులు నాగరాజు, పారా లీగల్ వాలంటీర్ మధుసూదన్, న్యాయశాఖ సిబ్బంది హాజరయ్యారు.






