గాయ‌ప‌డ్డ ఈ వ్య‌క్తిని గుర్తించండి

by Ratna Kumari |   (  Updated:2025-10-22 04:57:43  IST  )

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని ఫతేపూర్ గేటు సమీపంలో రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు తన బైక్ తో చెట్టును ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. మహబూబ్

గాయ‌ప‌డ్డ ఈ వ్య‌క్తిని  గుర్తించండి
X

దిశ, నవాబుపేట : మండల పరిధిలోని ఫతేపూర్ గేటు సమీపంలో రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు తన బైక్ తో చెట్టును ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ వ్యక్తిని గుర్తించాలని కోరుతూ ఎస్సై ఎం.విక్రమ్ ఆ వ్యక్తి ఫోటోలను, నడిపిన బైక్ ఫోటోలను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టును ఢీకొని గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఆ వ్యక్తిని ఆసుపత్రికి చేర్చగా ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో సిబ్బంది చికిత్సలు చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి దగ్గర అతడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పాటు అతడు నడిపిన వెహికల్ పై కూడా నంబర్ సరిగా లేకపోవడంతో ఆ వ్యక్తి ఆచూకీ కనుగొనడం పోలీసులకు కష్టతరంగా మారింది. అందువల్ల ఆ వ్యక్తి ఫోటోలను, ఆ వ్యక్తి నడిపిన బైక్ ఫోటోలను వాట్సప్ గ్రూపులో షేర్ చేసి అతడిని గుర్తించిన వారు తన మొబైల్ నంబర్ 8712659340 కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. అతడిని గుర్తించిన వారు అతని విలువైన ప్రాణాన్ని కాపాడిన వారవుతారని ఎస్సై అభిప్రాయపడ్డారు.

Next Story