- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ల కంటే నేనే ఎక్కువ.. ఉమ్మడి అధికారి అహంకారం!
ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లను సైతం ఖాతరు చేయకుండా అధికారి ఆకుల శ్రీకాంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో కలెక్టర్లను సైతం ఖాతరు చేయకుండా అధికారి ఆకుల శ్రీకాంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీజ్ చేసిన ఇసుక డంపులను నిబంధనలకు విరుద్ధంగా, తహశీల్దార్లను అడ్డుపెట్టుకుని తనకు ఇష్టమైన వారికి కట్టబెడుతూ లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. విధులను విస్మరించి హైదరాబాద్ కేంద్రంగా విందుల్లో మునిగితేలుతున్న సదరు అధికారి తీరుపై జిల్లావ్యాప్తంగా చర్చ సాగుతోంది.
దిశ, మహబూబ్‌నగర్ : ఉమ్మడి జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను సైతం సదరు అధికారి ఆకుల శ్రీకాంత్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ‘ఈ జిల్లాలో ఇసుకపై పూర్తి అధికారం నాదే.. నా మాటే శాసనం’ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని తోటి అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, క్షేత్రస్థాయి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం ఆయన దైనందిన శైలిగా మారిందని తెలుస్తోంది.
దిశ కథనంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చ...
‘విధులు పాలమూరులో.. విందులు హైదరాబాద్‌లో’ అని గురువారం ప్రచురితమైన కథనంపై జిల్లాలో తీవ్రమైన చర్చ సాగుతోంది. అక్రమాల్లో ఆరి తేరిన సదరు అధికారి ఉమ్మడి జిల్లాకు తానే సర్వాధికారినని విర్రవీగుతున్నట్లు చర్చ సాగుతోంది. స్థానిక జిల్లాస్థాయి అధికారులను, యంత్రాంగాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చాలా మంది బాహాటంగానే ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ వదిలేసి హైదరాబాద్ కేంద్రంగా చక్రం తిప్పుతూ విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారనే వార్తలు పూర్తిగా వాస్తవాలేనని ప్రజలు చర్చించుకుంటారు.
తహశీల్దార్ల ద్వారా ‘ఇష్టారాజ్యంగా’ ఇసుక విక్రయాలు?..
వంగూరు, ఉప్పనుంతల మండలాల్లో గతంలో సదరు ఆధికారి సీజ్ చేసిన ఇసుక డంపుల విషయంలో నిబంధనలు తుంగలో తొక్కి ప్రకారం బహిరంగ వేలం లేదా ప్రభుత్వ ఆదేశాల మేరకు జరగాల్సిన విక్రయాలను ఓ ఉన్నతాధికారి తనకిష్టమైన వారికి కట్టబెడుతున్నట్లు సమాచారం. స్థానిక తహశీల్దార్లను అడ్డు పెట్టుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీజ్ చేసిన ఇసుకను తమకు అనుకూలమైన వ్యక్తులకు తక్కువ ధరకే ధారాదత్తం చేస్తుండడం వెనుక రూ.లక్షల రూపాయల చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.






