షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం

by Nallavelli.Anjaneyulu |

షార్ట్ స‌ర్క్యూట్ తో గుడిసె ద‌గ్ధ‌మైన సంఘ‌ట‌న ఎర్ర‌వ‌ల్లి మండ‌లం కోదండ‌పురం గ్రామంలో చోటు చేసుకుంది.

షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం
X

దిశ, ఎర్రవల్లి : షార్ట్ స‌ర్క్యూట్ తో గుడిసె ద‌గ్ధ‌మైన సంఘ‌ట‌న ఎర్ర‌వ‌ల్లి మండ‌లం కోదండ‌పురం గ్రామంలో చోటు చేసుకుంది. కోదండ‌పురం ఎస్సై త‌రుణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కోదండ‌పురం గ్రామానికి చెందిన జంగం ప‌రువ‌రాముడు త‌న పొలం ప‌నుల కోసం వెళ్లాడు. భార్య వ్య‌వ‌సాయ కూలి ప‌నికి వెళ్లింది. పిల్ల‌లు పాఠ‌శాల‌కు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవ్వ‌రూ లేని స‌మ‌యంలో త‌డ‌క‌ల గుడిసెకు నిప్పు అంటుకొని పూర్తిగా ద‌గ్దం అయింది. దీంతో గుడిసెలో ఉన్న రూ.40వేల న‌గ‌దుతో పాటు ఒక తులం బంగారం, 40 తులాల వెండి ఆభ‌ర‌ణాలు, ద‌స్తావేజులు పూర్తిగా ద‌గ్ధం అయ్యాయ‌ని జంగం ప‌రుశ‌రాముడు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్సై త‌రుణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story