షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, పాన్ గ‌ల్ : మండల పరిధిలోని కేతేపల్లి గ్రామానికి చెందిన గడమాల కురుమయ్యకు చెందిన గుడిసె శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో దగ్ధమైంది.

షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం
X


దిశ‌, పాన్ గ‌ల్ : మండల పరిధిలోని కేతేపల్లి గ్రామానికి చెందిన గడమాల కురుమయ్యకు చెందిన గుడిసె శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో దగ్ధమైంది. గుడిసెలో గ్యాస్ సిలిండర్ ఉందని ఇంటి యజమాని చెప్పడంతో చుట్టు పక్కల ప్రజలు సిలిండర్ ఎక్కడ పేలుతుందోనని భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో హుటాహుటిన ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ ఇంజన్ వచ్చే లోపు గ్రామస్తులు, యువకులు మంటలు ఆర్పేందుకు నీళ్లు చల్లి తీవ్ర ప్రయత్నం చేశారు. వెంటనే ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పడంతో గ్రామస్తులు చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో వంట సామాగ్రి, బియ్యం, దుస్తులు కాలిపోయినట్టు బాధితులు తెలిపారు.

Next Story