దారుణం.. భార్య‌ను హ‌త్య‌ను చేసిన భ‌ర్త‌..!

by Ratna Kumari |

దిశ‌, మ‌క్త‌ల్ : క‌ట్టుకున్న భార్య‌ను భ‌ర్తే క‌డ‌తేర్చిన ఘ‌ట‌న మ‌క్త‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌క్త‌ల్ మండ‌లం స‌త్యారం గ్రామానికి

దారుణం.. భార్య‌ను హ‌త్య‌ను చేసిన భ‌ర్త‌..!
X


దిశ‌, మ‌క్త‌ల్ : క‌ట్టుకున్న భార్య‌ను భ‌ర్తే క‌డ‌తేర్చిన ఘ‌ట‌న మ‌క్త‌ల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌క్త‌ల్ మండ‌లం స‌త్యారం గ్రామానికి చెందిన వినోద‌, బాల‌కృష్ణారెడ్డిలు భార్య, భ‌ర్త‌లు. వీరిద్ద‌రికీ 6 నెల‌ల నుంచి త‌రుచూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. 12 సంవ‌త్స‌రాల కింద‌ట వీరికి పెళ్లి జ‌రిగింది. భ‌ర్త వేధింపులు ఎక్కువ అయ్యాయ‌ని.. కొద్ది రోజులు హైద‌రాబాద్ లో ఉండాల‌ని కుటుంబ పెద్ద చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ లో కూడా ఉన్న‌ప్ప‌టికీ.. అక్క‌డ కూడా వీరి మ‌ధ్య గొడ‌వ‌లు మాత్రం ఆగ‌లేదు. అయితే వినోద తండ్రి పుట్టింటికి తీసుకొచ్చి అక్క‌డే కూలీ ప‌నులు చేసుకుంటూ ఉన్నారు. త‌న కుమారుడిని మ‌క్త‌ల్ లోని ప్రైవేట్ పాఠ‌శాల‌లో చ‌దివిస్తుంది. అడ‌పా ద‌డ‌పా పుట్టింటి ద‌గ్గ‌ర ఉన్న భార్య వ‌ద్ద‌కు కృష్ణారెడ్డి వ‌చ్చి వెళ్లేవాడు. ఇదే క్ర‌మంలో ద‌స‌రా పండుగ‌కు కూడా భార్య‌త వ‌ద్ద‌కు వ‌చ్చిన కృష్ణారెడ్డి పొలం దగ్గ‌రికి పండుగ దావ‌త్ చేసుకోవ‌డానికి కుటుంబ స‌భ్యుల‌తో బైకుల‌పై వెళ్లాడు.

ఇక ఆ దావ‌త్ ముగిసిన త‌రువాత కుటుంబ స‌భ్యుల‌తో మేము వ‌స్తాం.. మీరు వెళ్లండి అని కృష్ణారెడ్డి చెప్ప‌డంతో కుటుంబ స‌భ్యులంద‌రూ పొలం వ‌ద్ద నుంచి ఇంటిక వ‌చ్చారు. వారంతా వెళ్లిపోగానే భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య మాట మాట పెరిగి గొడ‌వ జ‌రిగింది. దీంతో గొడ‌వ‌లో త‌న వెంట తెచ్చుకున్న ప‌దునైన ఆయుధంతో భార్య వినోద‌ గొంతు కోశాడు బాల‌ కృష్ణారెడ్డి. దీంతో త‌మ కూతురు, అల్లుడు ఇంటికి రాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి పొలం వ‌ద్ద‌కు వెళ్లాడు మామ‌. అక్క‌డికి వెళ్ల‌గానే ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న వినోద‌ను చూసి చికిత్స కోసం ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా.. అప్ప‌టికే మృతిచెందింద‌ని డాక్ట‌ర్లు ధృవీక‌రించారు. వినోద తండ్రి ఫిర్యాదు మేర‌కు మ‌క్త‌ల్ సీఐ రాంలాల్, ఎస్సై భాగ్య‌ల‌క్ష్మి కేసు న‌మోదు చేసుకున్నారు. ప‌రారీలో ఉన్న నిందితుడు బాల‌కృ|ష్ణారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ‌తంలో బాల‌కృష్ణారెడ్డి ఓ కేసులో చంచ‌ల్ గూడ జైలులో కూడా ఉండి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

Next Story