షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

by Ratna Kumari |

మండల కేంద్రంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కల్వకుర్తి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
X

దిశ, వంగూర్ : మండల కేంద్రంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కల్వకుర్తి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వంగూర్ గ్రామానికి చెందిన బండపల్లి అలివేల తన ఇంటికి తాళం వేసి పక్క గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లడంతో, ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు వ్యాపించి ఇంటిలోని సామాగ్రి మొత్తం కాలిపోయింది. సుమారు పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ.1లక్ష నగదు, 4తులాల బంగారం, వెండి వస్తువులు, ముఖ్యమైన పత్రాలు కాలిపోయాయని బాధితురాలు తెలిపారు. మంటల దాటికి ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. మొత్తం కోల్పోయి రోడ్డున పడ్డామని ఉండడానికి ఇల్లు, వండుకోవడానికి సామాగ్రి లేదు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story