ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత మన్నె కు గౌరవ డాక్టరేట్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బ్యూరో : శ్రమను నమ్ముకొని.. అంచలు అంచలుగా ఎదుగుతూ ... ప్రపంచ ధనవంతులలో ఒకరిగా ఎదిగి.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన మన్నే

ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత మన్నె కు గౌరవ డాక్టరేట్
X

దిశ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బ్యూరో : శ్రమను నమ్ముకొని.. అంచలు అంచలుగా ఎదుగుతూ ... ప్రపంచ ధనవంతులలో ఒకరిగా ఎదిగి.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన మన్నే స‌త్య‌నారాయ‌న‌రెడ్డికి పాలమూరు విశ్వవిద్యాలయం మొట్ట మొదటి గౌరవ డాక్టరేట్ ని ప్రకటించింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం గుర్లకుంట గ్రామంలో సోమేశ్వరమ్మ-అచ్చమ్మ దంపతుల ఆరుగురి సంతానంలో సత్యనారాయణ రెడ్డి నాలుగో సంతానం. ఈయన తన పాఠశాల విద్యను నవాబుపేట, ఇంటర్మీడియట్ మహబూబ్ నగర్ బాలుర జూనియర్ కళాశాల, డిగ్రీ ఎంబీఎస్ కళాశాలలో పూర్తి చేశాడు. ఎస్వీ యూనివర్సిటీలో ఫిజికల్ ఆంథోపాలజీ, ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ సబ్జెక్టుతో పీజీ పూర్తిచేసి , అక్కడే పీహెచ్ డీ చేసి డాక్టరేట్ పొందారు. అనంతరం ఆయన రెడ్డి లాబరేటరీస్ లో జనరల్ మేనేజర్ గా చేరిన తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2003లో ఎంఎస్ఎన్ యాబరేటరీస్ ను స్థాపించి .. అనతి కాలంలోనే సంస్థను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసి.. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చేశారు. నిబద్ధత, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచి పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు మాత్రమే కాకుండా.. తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా వన్నెతెచ్చిన.. మన్నేకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసేందుకు పాలమూరు విశ్వవిద్యాలయం అధికారులు నిర్ణయించారు. ఈనెల 16న పాలమూరు విశ్వవిద్యాలయం స్నాతపూర్త్సవానికి ముఖ్యఅతిథిగా , వాయిస్ ఛాన్స్ లర్ హోదాలో హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా అవార్డు ప్రధానం జరగనుంది. పాలమూరు విశ్వవిద్యాలయం ప్రధానం చేసే మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ సత్యనారాయణ రెడ్డికి దక్కడం పట్ల ఉమ్మడి పాలమూరు జిల్లా మేధావులు, విద్యావేత్తలు, పలు సంఘాల నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story