రాష్ట్రంలో దారుణం.. భర్తను నరుకుతూ సెల్ఫీ తీసుకున్న భార్య

by Ajay Maddhiboyina |

త‌మిళ‌నాడులో దారుణం చోటు చేసుకుంది. వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని ఓ భార్య త‌న భ‌ర్త‌ను అతి కిరాత‌కంగా హ‌త్య చేసింది.

రాష్ట్రంలో దారుణం.. భర్తను నరుకుతూ సెల్ఫీ తీసుకున్న భార్య
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడులో దారుణం చోటు చేసుకుంది. వివాహేత‌ర సంబంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని ఓ భార్య త‌న భ‌ర్త‌ను అతి కిరాత‌కంగా హ‌త్య చేసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... అస్సాంకు చెందిన అమీర్ అలీ, రుహీమా భార్య భ‌ర్త‌లు. వీరిద్ద‌రూ చెన్నైలో నివాసం ఉంటూ మెడిక‌ల్ ఫీల్డ్ లో ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో రుహీమాకు అష్ర‌ఫ్ అలీ అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్ప‌డి అది వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. ఆ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌డంతో ఇంట్లో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. దీంతో భ‌ర్త‌ను ఎలాగైనా అడ్డు తొల‌గించుకోవాల‌ని ప్లాన్ చేసిన భార్య ప్రియుడితో క‌లిసి అత‌డికి మ‌త్తు మందు ఇచ్చింది. అనంత‌రం అత‌డి గొంతు కోసి హ‌త్య చేశారు.

అక్క‌డితో ఆగ‌కుండా కేసు నుండి త‌ప్పించుకునేందుకు మృతుడి శ‌రీర‌భాగాల‌ను వేరు చేస్తూ దానిని భార్య సెల్ఫీ వీడియో తీసుకుంది. శ‌రీరాన్ని ముక్కలు ముక్క‌లుగా చేసి సూట్ కేసులో పెట్టి పెరంబూర్ రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ప‌డేశారు. పోలీసులకు స‌మాచారం అంద‌డంతో ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని సూట్ కేసు ప‌రిశీలించ‌గా అందులో కాళ్లు, చేతులు, త‌ల లేక‌పోవ‌డంతో కేసు వారికి స‌వాలుగా మారింది. అయిన‌ప్ప‌టికీ సూట్ కేసులో ఉన్న బ్రాండెడ్ దుస్తుల బార్ కోడ్, కాల్ డేటా, వాట్సాప్ లొకేష‌న్ ఆధారంగా నిందితుల వ‌ద్ద‌కు పోలీసులు చేరుకున్నారు.

అదుపులోకి తీసుకున్న త‌ర‌వాత భార్య ఫోన్ లో శ‌రీర భాగాల‌ను వేరు చేసేట‌ప్పుడు ఆనందంగా భార్య తీసుకున్న సెల్ఫీలు కీల‌క ఆధారాలుగా మారాయి. మ‌రోవైపు కేసు నుండి త‌ప్పించుకునేందుకు నిందితులు చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో శ‌రీర అవ‌శేషాలు ప‌డేసిన‌ట్టు విచార‌ణ‌లో తేలింది. విచార‌ణ‌లో త‌న భ‌ర్త ఓ మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడ‌ని, దాని వ‌ల్ల త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌నే హ‌త్య చేసిన‌ట్టు నిందితురాలు చెప్పింది. నిందితులు పొంత‌న‌లేని స‌మాధానాలు చెబుతుండ‌టంతో కేసు విచార‌ణ కొన‌సాగుతోంది.

Next Story