నటసింహం బాలకృష్ణకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

by Malleboina Mahesh |

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

నటసింహం బాలకృష్ణకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో "సినీ, రాజకీయ, సేవా రంగాల్లో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మ భూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను" అని సీఎం చంద్రబాబు నాయుడు తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story