విద్యార్థిని ప‌ట్ల అస‌భ్య వ్య‌వ‌హారం.. హెచ్ఎం, మ‌రో ఉపాధ్యాయుడు స‌స్పెండ్

by Ratna Kumari |

నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా వ్యవహరించడంతో పాటు, లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డి ని సస్పెండ్ చేసినట్లుగా డీఈవో గోవిందరాజులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్థిని ప‌ట్ల అస‌భ్య వ్య‌వ‌హారం.. హెచ్ఎం, మ‌రో ఉపాధ్యాయుడు స‌స్పెండ్
X

దిశ‌, మ‌ద్దూరు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా వ్యవహరించడంతో పాటు, లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డి ని సస్పెండ్ చేసినట్లుగా డీఈవో గోవిందరాజులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాలలో ఇంత తతంగం జరుగుతున్న వాటిని అదుపు చేయడంలో విఫలం అయ్యార‌నే ఆరోపణలతో ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులును, నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా పాఠశాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి.. జరిగిన సంఘటనలకు సంబంధించి సీసీ ఫుటేజ్ లను గ్రామ సర్పంచ్‌ భర్త, తదితరులకు పంపిన నేపథ్యంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డిల పై కేసు నమోదు కావడం.. పోలీసులు రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లుగా డీఈవో గోవిందరాజులు తెలిపారు.

Next Story