రైతుల‌కు ఓల్టేజ్ నాణ్య‌మైన విద్యుత్ : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Nallavelli.Anjaneyulu |

రైతులకు క‌రెంట్ క‌ష్టాలు తీర్చాలంటే స‌బ్ స్టేష‌న్ ఏర్పాటు చేయ‌డ‌మే ప‌రిష్కార‌మ‌ని మంజూరు చేయించిన‌ట్టు మంత్రి వాకిటి శ్రీహ‌రి తెలిపారు.

రైతుల‌కు ఓల్టేజ్ నాణ్య‌మైన విద్యుత్ : మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ, మక్తల్ : రైతుల‌కు ఓల్టేజ్ నాణ్య‌మైన విద్యుత్ అని మంత్రి వాకిటి శ్రీహ‌రి పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని మాన‌గూర్ మండ‌లం వాడ్వాట్ గ్రామంలో రూ.2కోట్ల‌90 ల‌క్ష‌ల‌తో నిర్మించే 33/11 కే వి విద్యుత్ సబ్ స్టేషన్ కోసం మంత్రి వాకిటి శ్రీహ‌రి భూమి పూజ చేశారు. స‌ర్పంచ్ ర‌వీంద‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ లిప్ట్ ఇరిగేష‌న్లు, పెద్ద‌వాగు ప‌రిస‌ర ప్రాంతాల్లో రైతులు వ్య‌వ‌సాయ బోర్ల కింద వంద‌లాది ఎక‌రాల పంట‌ల‌ను సాగు చేస్తున్నార‌ని తెలిపారు. నీటి వినియోగానికి ఉప‌యోగించే పంపుసెట్ల‌కు క‌రెంట్ స‌మ‌స్య‌ల‌పై ఈ ప్రాంత రైతులు త‌న దృష్టికి తీసుకురాగా.. రైతులకు క‌రెంట్ క‌ష్టాలు తీర్చాలంటే స‌బ్ స్టేష‌న్ ఏర్పాటు చేయ‌డ‌మే ప‌రిష్కార‌మ‌ని మంజూరు చేయించ‌డం జ‌రిగింద‌న్నారు. యాసంగి పంట‌లో సైతం ఈ ప్రాంతంలో క‌రెంట్ స‌మ‌స్య‌లు తీరుతాయ‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం రైతుల ప‌క్ష‌పాతి అని రైతుల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి ముందుంటుంద‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యుత్ ఏడీ గంగాధ‌ర్, మాజీ జ‌డ్పీటీసీ ల‌క్ష్మారెడ్డి, మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story