- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవల్లి మండలంలో భారీ వర్షాలు.. కానరాని మండల అధికారులు
దిశ, రేవల్లి : మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి రేవల్లి ఏదుల మండలాలలోని ఆయా గ్రామాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యుత్ అంతరాయం

దిశ, రేవల్లి : మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి రేవల్లి ఏదుల మండలాలలోని ఆయా గ్రామాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యుత్ అంతరాయం అక్కడక్కడ నెలకొన్న త్రాగునీటి సరఫరాలో తీవ్రమైన ఆటంకం నెలకొంది. రేవల్లి లో 12.5 సెంటిమీటర్లు. ఏదులలో 8.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గనాంకాల అధికారి రవికుమార్ తెలిపారు. ఇటు నాగర్ కర్నూల్ పట్టణానికి వెళ్లడానికి బిక్కుబాయి దగ్గర వర్షపు నీళ్లు రోడ్డు పై నుంచి ప్రమాదకరంగా పొంగిపొర్లుతుండగా కేశంపేట గ్రామసమీపంలో కల్వర్టులో నుంచి వర్షపునీరు పొంగిపొర్లుతొందడంతో ఏదుల, రేవల్లి మండలాల ప్రజలకు వనపర్తి, నాగర్ కర్నూల్ పట్టణాలతో పాటు పక్కమండలాలకు కూడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
కనిపించని అధికారులు
గత రెండు రోజులనుండి భారీ వర్షాలు ఉన్నాయి. ప్రజలు ఇండ్లలో నుంచి బయటికి రావద్దు.. ప్రమాదకరమైన స్థలాలను గుర్తించి ప్రమాదాలను నివారించాలని రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం ప్రచార మాధ్యామల ద్వారా తెలుపుతోంది. కానీ మండలంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రజలను ప్రమాదల నుంచి అప్రమత్తం చేయాల్సిన రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎక్కడ కనపడలేదు. వర్షాలకు ఉద్యోగులు రాకపోవడంతో ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాలు ఖాళీగా మారాయి. ప్రమాదకరంగా పొంగి పారుతున్న వాగుల దగ్గరికి ప్రజలు ఎవరు వెళ్లకుండా ప్రమాదాలను నివారించడానికై స్వచ్ఛందంగా ఎవరికి వారు ట్రాక్టర్లను, వాహనాలు అడ్డంపెట్టి భారీ కేడ్లను ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు.






