- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షం.. ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
దిశ, నవాబుపేట : మండలంలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరద నీరు వచ్చి భారీగా చేరుకోవడంతో

దిశ, నవాబుపేట : మండలంలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరద నీరు వచ్చి భారీగా చేరుకోవడంతో మండలంలోని చెరువులు, కుంటల అలుగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షం కారణంగా రోడ్లపై వరద నీరు భారీగా ప్రవహించింది. పలు గ్రామాల రోడ్లు కోతలకు గురయ్యాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ప్రధానంగా ఇప్పటూరు గ్రామంలో ఇళ్లల్లోకి వరద నీరు చేరుకున్నది. వర్షం భారీగా కురుస్తున్నంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు సమృద్ధిగా కురివడం వల్ల ఏపుగా పెరిగిన వరి పంట మొత్తం నేలపాలు అయింది. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తమ నిత్యవసర వస్తువులు నీటిలో మునిగిపోయాయని, తమకు నిద్ర కూడా కరువు అయింది అని రోధిస్తున్నారు.






