జూరాలకు కొనసాగుతున్న భారీ వరద

by Batti.Sumithra |   (  Updated:2025-08-18 05:39:25  IST  )

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది.

జూరాలకు కొనసాగుతున్న భారీ వరద
X

దిశ, జోగులాంబ గద్వాల ప్రతినిధి : కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాలకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో 21 జూరాల ప్రాజెక్టు గేట్లు తెరిచి వరద నీటిని కిందకు వదులుతున్నారు. ఎగువ నుంచి జూరాలకు 1,55,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో 21 గేట్ల ద్వారా 1,45,971 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 33,010 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ ద్వారా కిందకు వదులుతున్నారు. జూరాల కుడి, ఎడమ కాలువల ద్వారా 1100 క్యూసెక్కుల సాగు నీటిని పొలాలకు వదులుతున్నారు. మొత్తం ప్రాజెక్ట్ ద్వారా 1,80,136 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్ట్ వైపు వదులుతున్నారు.

Next Story