కలెక్టర్ ఆర్డర్ కాపీని పట్టించుకోని హెడ్మాస్టర్..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, మిడ్జిల్ : డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించాలని కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కాపీని హెడ్మాస్టర్ లెక్క చేయకపోవడంతో తోటి ఉపాధ్యాయులు ఏం చేయాలో అర్థం కాని

కలెక్టర్ ఆర్డర్ కాపీని పట్టించుకోని హెడ్మాస్టర్..!
X

దిశ, మిడ్జిల్ : డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించాలని కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కాపీని హెడ్మాస్టర్ లెక్క చేయకపోవడంతో తోటి ఉపాధ్యాయులు ఏం చేయాలో అర్థం కాని సంఘటన కాస్త‌ ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మండలంలోని దోనూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు అంజమ్మ డిప్యూటేషన్ పై కంచనపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలని కలెక్టర్ ఆర్డర్ కాపీ జారీ చేశారు. దోనూర్ పాఠశాల హెడ్మాస్టర్ థారా సింగ్ కలెక్టర్ ఆర్డర్ కాపీని లెక్కచేయకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 15 రోజుల అవుతున్న కలెక్టర్ ఆర్డర్ కాపీ లెక్క చేయకపోవడంతో తోటి ఉపాధ్యాలు ఏమి చేయలేక పోతున్నారు. కంచనపల్లి పాఠశాలలో మొత్తం 66 మంది విద్యార్థులు ఉండగా.. ఇద్దరు ఉపాధ్యాయుల తో విద్యాబోధన కష్టంగా ఉంది అని పాఠశాల ఉపాధ్యాయురాలు తెలియజేశారు. మరొక టీచర్ పాఠశాలకు అవసరమని సూచించారు.


దోనూర్ ప్రాథమిక పాఠశాలలో 55 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా ఒక ఉపాధ్యాయురాలిని కంచనపల్లి పాఠశాలకు కలెక్టర్ ఆర్డర్ కాపీ ఇచ్చారు. అందుకు విరుద్ధంగా దోనూరు ప్రధానోపాధ్యాయుడు వ్యవహార శైలిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మండల ఎంఈఓ చెప్పిన స్పందించడం లేదు. ఎంఈఓ సరస్వతిని వివరణ కోరగా డిప్యూటేషన్ పై వెళ్ళాలని ఉపాధ్యాయురాలు అంజమ్మను పాఠశాల నుండి రిలీవ్ చేశామని సూచించారు. కంచనపల్లి పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నట్లు హాజరు ఉంటేనే ఈ నెల జీతం వస్తుందని చెప్పినా పట్టించుకోలేదని ఎంఈఓ తెలిపారు. హెడ్మాస్టర్ సపోర్టుతో ఉపాధ్యాయురాలు అంజమ్మ పాఠశాలకు వెళ్లకపోవడంతో జిల్లా విద్యాధికారికి సమస్యను తెలియజేశామని తెలిపారు.

Next Story