బాల్య వివాహాలు జ‌రిపితే క‌ఠిన చ‌ర్య‌లు : జిల్లా బాల‌ల ప‌రిర‌క్ష‌ణ అధికారి బాల్ రాజ్

by Ratna Kumari |

దిశ‌, న‌ర్వ : మండల పరిధిలోని లక్కర్‌దొడ్డి గ్రామంలో గ్రామ ప్రజలకు బాల్య వివాహాలపై జిల్లా బాలల పరిరక్షణ అధికారి బాల్‌రాజ్, ఎన్‌జీఓ ప్రతినిధి శైలజ, గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్

బాల్య వివాహాలు జ‌రిపితే క‌ఠిన చ‌ర్య‌లు : జిల్లా బాల‌ల ప‌రిర‌క్ష‌ణ అధికారి బాల్ రాజ్
X

దిశ‌, న‌ర్వ : మండల పరిధిలోని లక్కర్‌దొడ్డి గ్రామంలో గ్రామ ప్రజలకు బాల్య వివాహాలపై జిల్లా బాలల పరిరక్షణ అధికారి బాల్‌రాజ్, ఎన్‌జీఓ ప్రతినిధి శైలజ, గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ స‌మావేశంలో బాల‌ల ప‌రిర‌క్ష‌ణ అధికారి బాల్ రాజ్ మాట్లాడుతూ బాల్యవివాహాలు చేస్తే చట్టపర మైనా శిక్షాహారులు అని తెలిపారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ ప్రజలు బాల్యవివాహాలపై సమిష్టిగా ప్రతి ఒక్కరూ నిర్మిలించుటకై పని చేయాలని గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. బాలల హక్కుల పరిరక్షణపై, ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. వారి భద్రత, విద్య వంటి అంశాల్లో తల్లిదండ్రుల బాధ్యత అని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పెద్ద మల్లేష్, ఎల్లప్ప, చిన్న అంజన్న, వెంకటేశ్వర్ రెడ్డి, గొల్ల కృష్ణయ్య ,నరసింహ, విమలయ్య, స్కూల్ ప్ర‌ధానోపాధ్యాయుడు, అంగన్ వాడి ఆశా వర్కర్, పాల్గొన్నారు.

Next Story