ముంపు బాధితుల దీక్ష‌ల‌కు హ‌రీశ్ రావు సంఘీభావం

by Ratna Kumari |

గ‌త కొద్ది రోజులుగా గొల్ల‌ప‌ల్లి-చీర్క‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాటానికి సంఘీభావంగా ఈనెల 9న మాజీ మంత్రి హరీష్ రావు రానున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు.

ముంపు బాధితుల దీక్ష‌ల‌కు హ‌రీశ్ రావు సంఘీభావం
X

దిశ‌, రేవ‌ల్లి : గ‌త కొద్ది రోజులుగా గొల్ల‌ప‌ల్లి-చీర్క‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిలపక్ష పోరాటానికి సంఘీభావంగా ఈనెల 9న మాజీ మంత్రి హరీష్ రావు రానున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. అనంతరం జరగబోయే బహిరంగ సభలో ప్రసంగించినట్టు ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున్న తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆదివారం ఆయన దీక్ష శిభిరాన్ని సందర్శించి మాట్లాడారు. పార్టీ శ్రేణులను, ప్రజలను సమన్వయం చేస్తూ గోపాల్ పేట, బుద్దారం,రెవల్లి రైతు దీక్షా శిబిరం మరియు ఏదుల గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుకూలంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కానీ సొంత ప్రయోజనాల కోసం ప్రజల వ్యతిరేకిస్తున్న రిజర్వాయర్ నిర్మాణానికి పూనుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. 98రోజులుగా రైతులు భూములను కోల్పోవడానికి సిద్ధంగా లేమని ఎదుల రిజర్వాయర్ నుండి కేవలం ఒక తూము ద్వారా మా ప్రాంతం సస్యశామలం అవుతుందని గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేయడం వల్ల పూర్తిగా నష్టపోతామని రైతులు స్పష్టం చేస్తున్న ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సొమ్ము లూటీ చేయడానికి మొండి వైఖరి అవలంభిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులుదొడ్ల రాములు, రమేష్ యాదవ్, సునీల్ కుమార్, జీ. రాములు, మహమూద్ పాల్గొన్నారు.

Next Story