- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరాటే మాస్టర్ల విన్యాసాలతో అబ్బురపరిచిన 'హ్యాపీ సండే'
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలోని భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'హ్యపీ సండే' కార్యక్రమంలో కరాటే మాస్టర్ల విన్యాసాలు చూపరులను అబ్బురపరచాయి.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలోని భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'హ్యపీ సండే' కార్యక్రమంలో కరాటే మాస్టర్ల విన్యాసాలు చూపరులను అబ్బురపరచాయి. మహబూబ్ నగర్ శ్రీ హనుమాన్ కరాటే అండ్ యోగా అసోసియేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, బ్లాక్ బెల్ట్ గ్రహిత కోటకద్ర వెంకటేష్ తన యోగా, కరాటే విద్యను ప్రదర్శించారు. మరో కరాటే మాస్టర్, రిటైర్డ్ ఏఎస్ఐ సడ్డె బాలరాజ్ తన చేతులపై కారును నడిపించి, కళ్ళకు పూర్తిగా గంతలు కట్టుకుని మోటారు బైక్ ను నడిపి శారీరక దృఢత్వం, మానసిక శక్తిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి విన్యాసాలు ఆత్మరక్షణ కోసం చేసినవి కావని, తన కఠినమైన శిక్షణ, మనోనిబ్బరం, శరీర సమతుల్యతకు నిదర్శనంగా చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు.






