- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదోతరగతి విద్యార్థినికి మంత్రి చొరువతో హాల్ టికెట్
ఈ ఏడాది వెంకటమ్మ పదోతరగతి పరీక్షలు రాయలేనని కుమలిపోతున్న సమయంలో ఈ విషయం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి కొందరూ తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరువ తీసుకొని స్కూల్ ఆఫ్ డైరెక్టర్ వారిని సంప్రదించి.. రూ.125 ఫీజుకు రూ.2వేలు అదనపు రుసుమును చెల్లించాడు.

దిశ, మక్తల్ : సాధారణంగా ఒక రాష్ట్ర మంత్రి తలుచుకుంటే కానీ పని ఏది ఉండదు అని నిరూపించాడు మంత్రి వాకిటి శ్రీహరి. మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఓ పేద విద్యార్థిని పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు దాటింది. ఎవ్వరి సహకారం లేక ఈ ఏడాది వెంకటమ్మ పదోతరగతి పరీక్షలు రాయలేనని కుమలిపోతున్న సమయంలో ఈ విషయం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి కొందరూ తీసుకెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరువ తీసుకొని స్కూల్ ఆఫ్ డైరెక్టర్ వారిని సంప్రదించి.. రూ.125 ఫీజుకు రూ.2వేలు అదనపు రుసుమును చెల్లించాడు.
దీంతో ఆ విద్యార్థిని పదో తరగతి పరీక్షలు రాసేందుకు స్కూల్ ఆఫ్ డైరెక్టర్ నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ తో హాల్ టికెట్ పంపించిన కథనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 14 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరువ తీసుకున్నందుకు సోషల్ మీడియాలో మంత్రి పేరు మారుమ్రోగిపోతుంది. దళిత వర్గానికి చెందిన పేద విద్యార్థిని పరీక్ష ఫీజు చెల్లించలేదు. పరీక్ష ఫీజు చెల్లించనుందున హాల్ టికెట్ రాలేదు. దీంతో సమస్యను మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా.. మంత్రి స్పందించి వెంకటమ్మ అనే విద్యార్థిని పదోతరగతి పరీక్షలు రాయాలని.. రాయించే బాధ్యత తనదేనని తెలిపారు. మూడు రోజుల్లోనే హాల్ టికెట్ అధికారికంగా కేటాయించారు. దీంతో ఆ విద్యార్థిని మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది.






