- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉడిత్యాలలో వడగళ్ల వాన బీభత్సం
బాలనగర్, మిడ్జిల్ మండలాల్లో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.

దిశ, జడ్చర్ల : బాలనగర్, మిడ్జిల్ మండలాల్లో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు విపరీతమైన గాలి వీచింది. ఇక భారీ వర్షం కురవడంతో పాటు బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా బాలనగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో వడగళ్ల వాన కురవడంతో రైతుల మామిడి పంటలు నేలరాలాయి. దీంతో రైతులకు అపార నష్టం కలిగింది. గ్రామంలో గాలి దుమారానికి నిలిచిన వాహనాలు సైతం స్వతహాగా కదలడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. మండలంలోని కొత్త సూరారం గ్రామంలో ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు గాలి గూడెం లలిత అనే మహిళకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి పంటలు నేలరాలాయి. మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు పరిసరాల గ్రామంలో సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రైతులకు సంబంధించిన వరి, మామిడి పంటలకు నష్టం వాటిళ్లడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






