- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ కాలుష్యం దినోత్సవం రోజే పచ్చని చెట్లపై మంటలు
దిశ, ఉప్పునుంతల : జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం రోజే పచ్చని మొక్కల పై పైశాచికం ప్రదర్శించిన సంఘటన ఉప్పునుంతల మండలంలోని ఐకేపీ కార్యాలయంలో చోటు చేసుకుంది.

దిశ, ఉప్పునుంతల : జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం రోజే పచ్చని మొక్కల పై పైశాచికం ప్రదర్శించిన సంఘటన ఉప్పునుంతల మండలంలోని ఐకేపీ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఒకే రోజు బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఓవైపు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా పచ్చని మొక్కలు నాటి కాలుష్య నియంత్రణకు పాటు పడితే మరో పక్క పచ్చని మొక్కలకు నిప్పు పెట్టి మంటకు మొక్కలు ఆహుతైన ఘటన ఉప్పు నుంతల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం పక్కనున్న మహిళా సమాఖ్య భవనంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల యూనిఫాం కుడుతున్న మహిళలు కటింగ్ కు వాడిన బట్టల వ్యర్థాలు బిల్డింగ్ పక్కన వేసి అంటిపెట్టం వల్ల పెద్ద ప్రమాదం సంభవించింది. దీంతో పొగ చూరడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తీర చూస్తే కాల్చుతున్న బట్టల వ్యర్థాలే కానీ పక్కనే బిల్డింగ్ కు అనుకోని ఉన్న మండల కేంద్రానికి చెందిన పల్లె ప్రకృతి వనం చెట్లు కొన్ని కాలిపోయాయి మండల కేంద్రంలో అది కూడా మండల సముదాయం ప్రాంతంలో జరగటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా భావిస్తున్నారు. మండల ప్రజలు, పచ్చదనం, పరిశుభ్రత అనే నినాదంతో ప్రభుత్వాలు లక్షల రూపాయలు వెచ్చించి హరిత హారం కార్యక్రమంలో మొక్కల పెంపకాన్ని చేపడితే అవగాహన లేకుండా ఇలా పెరిగిన చెట్లను కాల్చడమేంటని మండల ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సంబంధిత ఐకేపీ అధికారులు తమ సిబ్బందికి సంఘం సభ్యులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.






