- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : కలెక్టర్ విజయేందిర బోయి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు వేగ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదే శించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వీసీ కాన్ఫరెన్స్ హాల్ లో ఆమె రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్, ఐకేపి, సహకార శాఖ, మిల్లర్ లతో సమావేశం నిర్వహించి ధాన్యం కొనుగోళ్లు పై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం కు వచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం ఉన్న ధాన్యం కాంటా వేయాలని అన్నారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా వర్షం పడితే ధాన్యం తడవకుండా టార్పాలిన్ లు సిద్ధంగా ఉంచుకోవాలని, ధాన్యం కొనుగోలు చేసి మిల్లుకు పంపించాలని సూచించారు. మిల్లర్లు వచ్చిన ధాన్యమును వెంటనే దిగుమతి చేసుకొని ఓపిఎంఎస్ లో అంగీకరిస్తేనే రైతులకు మద్దతు ధర విడుదల చేయడానికి ఉంటుందని, కాబట్టి మిల్లర్లందరూ సహకరించాలని కోరారు. కొనుగోళ్లలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. పత్తి కొనుగోళ్లపై సమీక్షిస్తూ, పత్తి 7 క్వింటాళ్ల పై దిగుబడి ఉంటే రైతు వ్యవసాయ విస్తరణ అధికారి ధృవీకరించిన సర్టిఫికెట్ తో కొనుగోలుకు తీసుకురావాలని తెలిపారు. మొక్క జొన్న కొనుగోళ్ల పై సమీక్షించి వేగంగా కొనుగోళ్ళు చేయాలని, సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాలు సందర్శించి సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, పౌరసరఫరాల సంస్థ డిఎం రవి నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, జిల్లా సహకార అధికారి కృష్ణ, డిఆర్డీఓ నర్సింహులు, మార్కెటింగ్ అధికారిని బాలమణి, జిల్లా సహకార ఆడిట్ అధికారి టైటస్ పాల్గొన్నారు.






