- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు అందుబాటులో లేని జీపీఓలు
గ్రామపంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవలు అందించాల్సిన జీపీఓలు తహసీల్దార్ కార్యాలయానికి పరిమితం కావడంతో ప్రజలు , విద్యార్థులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, మిడ్జిల్ : గ్రామపంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవలు అందించాల్సిన జీపీఓలు తహసీల్దార్ కార్యాలయానికి పరిమితం కావడంతో ప్రజలు , విద్యార్థులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తహసిల్దార్ కార్యాలయంలోని జిపిఓలు ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నారు. ఎవరైనా పని మీద వస్తే దరఖాస్తులు తీసుకొని గ్రామాలకు వచ్చి విచారణ చేస్తామని తెలుపుతున్నారు. పనులు మానుకొని వస్తే దరఖాస్తులు విచారణ చేయాలని, కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందే గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటే రైతులు రెండు మూడు సార్లు కార్యాలయం చుట్టూ తిరిగే వాళ్ళం కాదని తెలుపుతున్నారు. గ్రామాలకు రాకపోవడం తో తహసిల్దార్ కార్యాలయంకు రావాల్సి వస్తుందని పలువురు పేర్కొన్నారు. తహసిల్దార్ కార్యాలయంలోని పరిమితమైన జిపిఓ లను తహశీల్దార్ స్వప్న పట్టించుకోకపోవడంతో జిపిఓల ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇకనైనా జిపిఓ లను గ్రామస్థాయిలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు , రైతులు , విద్యార్థులు కోరుతున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం : తహసిల్దార్ స్వప్న
గ్రామాలలో పూర్తిస్థాయిలో జీపీఓలను ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






