- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాబాయి
శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాబాయి
by Ratna Kumari |
దిశ, ఆసిఫాబాద్ : మామ చేతిలో హత్యకు గురైన గర్భిణీ మహిళ తెలండి శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుష్రం నీలా బాయి అన్నారు. బుధవారం ద

X
దిశ, ఆసిఫాబాద్ : మామ చేతిలో హత్యకు గురైన గర్భిణీ మహిళ తెలండి శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు కుష్రం నీలా బాయి అన్నారు. బుధవారం దహేగాం మండలం గేర్రె గ్రామంలోని శ్రావణి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గర్భిణీగా ఉన్న శ్రావణి హత్య చేసి రెండు ప్రాణాలు తీశారని పేర్కొన్నారు. ఇది కుల దురహంకార హత్య అని.. సత్తయ్యతో పాటు అతని కుటుంబ సభ్యుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని.. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం, 5 ఎకరాల భూమి ఇవ్వడంతో పాటు వారి కుటుంబానికి రక్షణ లభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కార్తీక్, దుర్గం దిన్ కార్, అశోక్, ఆనంద్ ఉన్నారు.
Next Story






