- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం
దిశ, గద్వాల క్రైమ్ : ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల

దిశ, గద్వాల క్రైమ్ : ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వేణు కాలనీలో నివాసం ఉంటున్న స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) రమణారెడ్డి (55) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తొలుత గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం వైద్యులు మొదట ఆయనను కర్నూలుకు తరలించాలని సూచించారు. కర్నూలులో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించినట్టు సమాచారం.
అప్పుల వేధింపులే కారణమని వెల్లడి
ఆత్మహత్యాయత్నంకు గల కారణం అప్పుల వాళ్లు వేధింపులకు గురిచేయడం వల్లే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు రమణారెడ్డి సమీప బంధువులువెల్లడించారు. ప్రస్తుతం అయిజ మండలం, చిన్నతాండ్రపాడు గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్న రమణారెడ్డికి భార్య, వివాహమైన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు అప్పుల బాధతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.






