రేవల్లిలో అద్దె భవనాలకే పరిమితమైన ప్రభుత్వ కార్యాలయాలు

by Disha Web Desk 23 |
రేవల్లిలో అద్దె భవనాలకే పరిమితమైన ప్రభుత్వ కార్యాలయాలు
X

దిశ, రేవల్లి : వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని 2016 నుండి ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న తహసీల్దార్‌ కార్యాలయం, అలాగే పోలీస్ స్టేషన్ స్వంత భవనాలు లేక అసౌకర్యాల మధ్య అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. భవనాలు కార్యాలయాలకు ఏ మాత్రం అనుకూలంగా లేక ఇటు ప్రజలు అటు అధికారులు ఏళ్ల కాలం ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా కార్యాలయాలలో రికార్డులు, కంప్యూటర్లు, అధికారులకు సరైన గదులు లేవు, పోలీస్ స్టేషన్ లో రాత్రి అయ్యిందంటే చాలు విషసర్పాలు అలాగే సిబ్బందికి పడుకోవలసిన సరైన గదులు వసతులు కూడా లేవు.

ప్రతి నెల 6500 చెల్లిస్తూ ఉన్నారు. రక్షణ కల్పించవలసిన రక్షక భటులకే సరైన రక్షణ లేదు. అదేవిధంగా మండల తహసీల్దార్ కార్యాలయం నెలకు 13 వేల రూపాయల అద్దె చెల్లిస్తూ కొనసాగుతున్నారు. రేవల్లి మండల కేంద్రంలో కనీస సౌకర్యాలు కూడా కర్వే మండల కేంద్రంగా ఏర్పాటై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు అమలుకు నోచని నేతల హామీలు పట్టించుకోని అధికారులు ఫలానా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆక్టోబర్‌ 11న కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా వనపర్తి జిల్లా నుంచి ఉమ్మడి గోపాల్పేట్ మండలంలో ఉన్న రేవల్లి ని 11 పంచాయతీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో రేవల్లి మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం బస్ సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు 2016 నుండి ఇప్పటివరకు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.


Next Story