డ్యాన్స్ చేస్తూ పెళ్లి కూతురు సోదరి.. మృతి (వీడియో)

by Disha Web Desk 12 |
డ్యాన్స్ చేస్తూ పెళ్లి కూతురు సోదరి.. మృతి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: హల్దీ వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన పెళ్లి కూతరు సోదరి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. ఈ విషాదైన అనూహ్య సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో తన సోదరి హల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న ఓ అమ్మాయి ఒక్కసారిగా కిందపడిపోయింది. అక్కడున్న వ్యక్తులు ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించం కనిపించింది. కాగా కింద పడిపోయిన పెళ్లి కూతురు సోదరి ఎంతకు మేల్కొనకపోవడంతో, వారు వెంటనే ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కాగా ఆ యువతి ఊపిరి ఆడక చనిపోయిందా.. లేక గుండెపోటు కారణంగా చనిపోయిందా అనే విషయం మాత్రం తెలియరాలేదు.



Next Story

Most Viewed