లక్నో లోక్‌సభ స్థానం నుంచి 251 సార్లు జైలుకు వెళ్లిన SP నేత పోటీ

by Disha Web Desk 17 |
లక్నో లోక్‌సభ స్థానం నుంచి 251 సార్లు జైలుకు వెళ్లిన SP నేత పోటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో లక్నో స్థానానికి రికార్డు స్థాయిలో 251 సార్లు జైలుకు వెళ్లినటువంటి సమాజ్‌వాదీ పార్టీ (SP) అభ్యర్థి రవిదాస్ మెహ్రోత్రా పోటీ చేస్తున్నారు. ఆయన తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 251 కంటే ఎక్కువ సార్లు జైలుకు వెళ్లడం ద్వారా ఒక రికార్డును సృష్టించారు. అయితే ఆయనపై ఒక్క క్రిమినల్ కేసు లేకపోవడం గమనార్హం. 66 ఏళ్ల వయసు కలిగిన రవిదాస్ మెహ్రోత్రా లక్నో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. విద్యార్థిగా ఉన్న దశ నుంచే ఆయన పలు ఉద్యమాలు, నిరసనల్లో పాల్గొన్నారు.

తన జైలు రికార్డు గురించి రవిదాస్ మాట్లాడుతూ, నాపై ఉన్న కేసులన్నీ నేను యూనివర్సిటీ రోజుల్లో, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను చేసిన ఉద్యమాలు, నిరసనలకు సంబంధించినవి. ఇన్ని కేసులు చూస్తేనే తెలుస్తుంది, నేను ఎంతటి పోరాట యోధున్ని అని, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నాపై ఒక్క 'క్రిమినల్' కేసు కూడా లేదు అని అన్నారు.

ఎన్నికల గురించి మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వంలో హింసకు గురైన ముస్లింలు, దళితులు, క్రైస్తవులు, ప్రత్యేకించి బ్రాహ్మణులు కావచ్చు, అణగారిన వారందరి కోసం SP ప్రభుత్వం పని చేస్తుంది. కులాలకు అతీతంగా అందరికీ అన్ని ఫలాలు అందేలా చూస్తాము. తమ పార్టీ అధికారంలోకి వస్తే వాగ్దానం చేస్తున్న అన్ని పథకాలను ఓటర్లకు అందిస్తామని అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇవ్వడం ద్వారా ఈ ఎన్నికల్లో తాను గెలిచే అవకాశం ఉందని రవిదాస్ మెహ్రోత్రా అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed