ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల ప‌ట్ల వివ‌క్ష‌త చూపుతోంది: టీఎస్ యూటీఎఫ్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మాన‌వ‌పాడు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల ప‌ట్ల వివ‌క్ష‌త చూపుతోందని టీయూఎస్ యూటీఎఫ్ గ‌ద్వాల జిల్లా అధ్య‌క్షుడు ర‌మేష్

ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల ప‌ట్ల వివ‌క్ష‌త చూపుతోంది: టీఎస్ యూటీఎఫ్
X

దిశ‌, మాన‌వ‌పాడు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల ప‌ట్ల వివ‌క్ష‌త చూపుతోందని టీయూఎస్ యూటీఎఫ్ గ‌ద్వాల జిల్లా అధ్య‌క్షుడు ర‌మేష్ పేర్కొన్నారు. గురువారం మాన‌వ‌పాడు మండ‌లంలోని వివిధ పాఠ‌శాల‌లోని ఉపాధ్యాయుల‌తో యూటీఎఫ్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా యూటీఎఫ్ గ‌ద్వాల జిల్లా అధ్య‌క్షుడు ర‌మేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను సమస్యల వలయంలో తోసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో హెల్త్ కార్డ్స్ చెల్లుబాటు అయ్యేవిధంగా పీఆర్సీ వెంటనే అమలు చేయాలని కృషి చేస్తుందని గుర్తుచేసింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, కార్యదర్శి బీసన్న, సురేష్ , సీనియర్ ఉపాధ్యాయులు వెంకటేష్ మౌలాలి, ఆనందం వెంకటస్వామి, నరసింహ, మద్దిలేటి, రమేష్ బాబు పాల్గొన్నారు.

Next Story