- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు
ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నామని మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సంపత్ కుమార్ సింగ్ అన్నారు.

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నామని మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సంపత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన ఆసుపత్రిలో ప్రభుత్వం అన్ని రకాల అత్యాధునిక వసతులు కల్పించిందని,గతంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు జరిగేవని కొన్ని పరికరాల కొరతతో శస్త్ర చికిత్సలకు గ్యాప్ ఏర్పడిందన్నారు. సమస్యను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా..వెంటనే అందుకు సంబంధించిన పరికరాలను సమకూర్చినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మోకాలి శస్త్ర చికిత్స విభాగం నిపుణుడు డాక్టర్.రమేష్ మాట్లాడుతూ..అచ్చంపేట బల్మూర్ మండలంకు చెందిన రాములుకు కుడి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స,నారాయణపేట జిల్లా,పెద్దజట్రం కు చెందిన అనంతమ్మకు తుంటి ఎముక కు శస్త్రచికిత్స లను విజయవంతంగా నిర్వహించామని ఆయన తెలిపారు. అనంతరం శస్త చికిత్సలు పొందిన రోగులు రాములు,అనంతమ్మలు మాట్లాడుతూ,తమకు చేసిన శస్త్ర చికిత్సలు వలన ఎలాంటి ఇబ్బందులు లేవని,ఆసుపత్రిలో సేవలు చాలా బాగా ఉన్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో సంప్రదిస్తే 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా తమకు ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించారని ,అందుకు కృతజ్ఞతలను వారు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ఎంఓ జరీనా,డాక్టర్లు ప్రవీయ్,శివరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.






