- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు
మైనార్టీల సంక్షేమానికి ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

దిశ, కొల్లాపూర్ : మైనార్టీల సంక్షేమానికి ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో రంజాన్ పండుగను ముస్లింలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఖాదర్ భాషా దర్గా వద్ద ఈద్గా ప్రాంగణంలో మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా తో మాట్లాడారు. మైనార్టీల సంక్షేమం కొరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనీ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మైనార్టీల అభివృద్ధి కొరకు కొల్లాపూర్ పట్టణంలో ఖాదర భాష దర్గా అభివృద్ధి కొరకు రూ.4.70 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి జూపల్లి తెలిపారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్నీ వర్గాలతో పాటు ముస్లింలకు సైతం అభివృద్ధి సంక్షేమం కోసం పాటు పడుతూ రంగాల్లోముస్లింలు కుటుంబాల్లోని పిల్లలు విద్యా పరంగా ఉన్నత శిఖరాలకు రాణించాలని, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరంతా మా వెంట ఉండి గెలిపించినందుకు మంత్రి జూపల్లి కృష్ణా రావు కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రహీం బాషా మంత్రి జూపల్లికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, ముస్లిం మత పెద్ద, డీసీసీ ఉపాధ్యక్షులు రంగినేని జ శ్వరుడు, రాంయాదవ్, పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.






