మ‌ద్దిమ‌డుగు ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో ట‌వ‌ర్ ఏర్పాటు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, అచ్చంపేట : మ‌ద్దిమ‌డుగు ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మ‌ద్దిమ‌డుగు ప‌బ్బ‌తి ఆంజ‌నేయ‌స్వామి దేవాలయం వ‌ద్ద ఇప్ప‌టివ‌ర‌కు మొబైల్

మ‌ద్దిమ‌డుగు ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో ట‌వ‌ర్ ఏర్పాటు
X

దిశ‌, అచ్చంపేట : మ‌ద్దిమ‌డుగు ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మ‌ద్దిమ‌డుగు ప‌బ్బ‌తి ఆంజ‌నేయ‌స్వామి దేవాలయం వ‌ద్ద ఇప్ప‌టివ‌ర‌కు మొబైల్ సిగ్న‌ల్ లేక‌పోవ‌డంతో భ‌క్తులు ఇబ్బందులు ప‌డేవారు. త్వ‌ర‌లోనే సెల్ ట‌వ‌ర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు.. దీంతో భ‌క్తులంద‌రికీ స‌మాచార వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌స్తుంద‌ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్ట‌ర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. సోమ‌వారం అచ్చంపేట‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మ‌ద్దిమ‌డుగు దేవ‌స్థానం చైర్మ‌న్, పాల‌క‌మండ‌లి స‌భ్యులు, ఈవో అన్ని విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ వరకు మ‌ద్దిమడుగు ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ త‌దిత‌ర వాటిపై అధికారులు ఇప్పటి నుంచే దృష్టి పెట్టాల‌ని ఆదేశించారు. కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, దేవస్థాన చైర్మన్ రాములు నాయక్ , ఈవో, పాలకమండలి డైరెక్టర్లు, డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ శంకర్ నాయక్, RWS డిప్యూటీ ఈ ఈ హేమలత, ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story