రైతుల ఇష్టం మేర‌కే గొల్ల‌ప‌ల్లి-చీర్క‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్

by Ratna Kumari |

రైతుల ఇష్టం మేర‌కే గొల్ల‌ప‌ల్లి-చీర్క‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేప‌డుతున్న‌ట్టు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు స‌త్య శీలారెడ్డి పేర్కొన్నారు.

రైతుల ఇష్టం మేర‌కే గొల్ల‌ప‌ల్లి-చీర్క‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్
X

దిశ‌, రేవ‌ల్లి : రైతుల ఇష్టం మేర‌కే గొల్ల‌ప‌ల్లి-చీర్క‌ప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేప‌డుతున్న‌ట్టు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు స‌త్య శీలారెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం ఏదుల‌లో నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌జ‌ల అనుమ‌తి లేకుండా ఎలాంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేప‌ట్ట‌మ‌ని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపిన విష‌యాన్ని గుర్తు చేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే ప్రాజెక్ట్ ల‌ను ప్ర‌తిపాదించి.. అదే ప్రాజెక్ట్ ల‌ను బీఆర్ఎస్ నాయ‌కులు వ్య‌తిరేకిస్తున్నార‌ని పేర్కొన్నారు. మాజీ మంత్రి హ‌యాంలో శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్ లో ఉన్న నీటిని ఎత్తిపోసుకోవ‌డానికి ఆన్ లైన్ రిజ‌ర్వాయ‌ర్లు అవ‌స‌రం అని.. గొల్ల‌ప‌ల్లి-చీర్క‌ప‌ల్లి గ్రామాల మ‌ధ్య‌న రిజ‌ర్వాయ‌ర్ నిర్మిస్తే సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని అక్టోబ‌ర్ 21, 2016న స‌ర్వే నిర్వ‌హించార‌ని గుర్తు చేశారు.

గ‌త పాల‌కుల‌కు స్వ‌లాభం చేకూర‌క‌పోవ‌డంతో నేడు ఈ ప్రాజెక్ట్ ని వ్య‌తిరేకిస్తున్న‌ర‌ని తెలిపారు. మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి దిగ‌జారుడు మానుకోవాల‌ని, ఎమ్మెల్యే ను తిడితే స‌హించ‌బోమ‌న్నారు. ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కారం.. గ్రామాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయ‌కులు 259 స‌ర్వే నెంబ‌ర్లు దాదాపు 83 ఎక‌రాల్లో దొంగ ప‌ట్టాలు చేసుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తే డ‌బ్బులు వ‌చ్చే విధంగా బినామీల‌కు ప‌ట్టా చేసిన విష‌యం వాస్త‌వం కాదా..? అని ప్ర‌శ్నించారు. ఏదుల మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు సుఖేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్న ఎమ్మెల్యేను నానా మాట‌లు అన‌డం స‌రైంది కాద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మల్లన్న సాగర్ లో పన్నెండు లక్షల పరిహారం ఇచ్చి.. ఇక్కడ రైతులకు మాత్రం నాలుగు లక్షల పరిహారం ఇచ్చి మోసం చేశారని తెలిపారు. మ‌ళ్లీ నేడు దొంగ దీక్షల పేరుతో జనాలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించుతున్నారని పేర్కొన్నారు. ముందుగా ముంపుగ్రామం బండరాయపాకుల కొంకలపల్లి గ్రామాలకు వెళ్లి రావాలని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్య రెడ్డి,సత్యశీల రెడ్డి, జైపాల్ రెడ్డి, పర్వాతాలు సర్పంచులు పరశురాములు, సురేష్ గౌడ్,తప్ప రాజయ్య, శ్రీశైలం యాదవ్, బాల నాగయ్య,జమ్మి మల్లేష్ పాల్గొన్నారు.

Next Story