బాలిక‌లు క్రీడ‌ల్లో రాణించాలి : ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ జిల్లెల చిన్నారెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, వ‌న‌ప‌ర్తి : బాలికలు విద్యను అభ్యసించడం తో పాటు క్రీడాలలో ను రాణించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆకాంక్షించారు. గురువారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు

బాలిక‌లు క్రీడ‌ల్లో రాణించాలి : ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షులు డాక్ట‌ర్ జిల్లెల చిన్నారెడ్డి
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి : బాలికలు విద్యను అభ్యసించడం తో పాటు క్రీడాలలో ను రాణించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆకాంక్షించారు. గురువారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి వనపర్తి జిల్లా గోపాలపేట మండలం, బుద్దారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్‌ స్థాయి స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వన‌ప‌ర్తి కలెక్టర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా జ్యోతి ప్రజ్వలన, జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి వనాలపర్తి మాత్రమేకాదని.. వనపర్తికి ఆటలపర్తి కూడా పేరుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని విద్యార్థులు సమానంగా తీసుకోవాలని సూచించారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో చదువుతోపాటు క్రీడల్లో కూడా అత్యున్నతంగా రాణించాలన్నారు. ఇటీవల భారత మహిళల జట్టు క్రికెట్లో ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన స్పోర్ట్స్ పాలసీని అమలుపరిచేందుకు కృషి చేస్తుందన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంచి క్రీడాకారుడని, ఆయనకు ఫుట్ బాల్ ఆటపై ఎంతో ఆసక్తి ఉందని, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పుట్ బాల్ ఆడేందుకు ఇష్టపడతారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అమ్మాయిలు క్రికెట్, ఫుట్ బాల్ ఆటల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. గ్రామీణస్థాయి విద్యార్థులు, క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు తర్ఫిదునివ్వాల‌ని సూచించారు. వందేమాతర గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు అందరూ వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాలన్నారు. గోపాల్ పేట ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు ప మరో ఎకరా స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు, జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని కేటాయించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంపై కూడా దృష్టి సారిస్తూ యోగ సాధన చేయాలని సూచించారు. వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ క్రీడల్లో ఓటమిని ఒక పాఠం గా తీసుకుని, మళ్లీ సాధన చేసి విజయాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. క్రీడలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన శాఖ జిల్లా అధికారి సుధీర్ రెడ్డి, డీసీఓ ప్రమోద, జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, గోపాల్ పేట తాసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపీడీవో అయిషా పాల్గొన్నారు.

Next Story