సమాజ పురోగాభివృద్ధికి బాలికలకు విద్య అవసరం

by Elthuri vijay kumar |

మాజం పురోగాభివృద్ధి చెందాలంటే బాలికలకు విద్య అవసరమని డిఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు.

సమాజ పురోగాభివృద్ధికి బాలికలకు విద్య అవసరం
X

సమాజ పురోగాభివృద్ధికి బాలికలకు విద్య అవసరం

-డీఎస్పీ వెంకటేశ్వర్లు

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: సమాజం పురోగాభివృద్ధి చెందాలంటే బాలికలకు విద్య అవసరమని డిఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహం-సీలో నిర్వహించిన బాలికల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ విద్యార్థుల ఉన్నత చదువులకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఉంటూ ఉన్నత చదువులు చదువుకోవడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని, ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సీఐ శ్రీనివాసులు, సుదర్శన్, వసతి గృహం సంక్షేమాధికారి స్వప్నప్రియ, విద్యార్థులు,తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story