డిగ్రీ కోర్సులో 'దోస్త్' ద్వారా సీటు పొందండి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-04-17 15:57:06  IST  )

ఇంటర్ పాసైన విద్యార్థులు తమకు నచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో, నచ్చిన కోర్సుని ఎంపిక చేసుకోవడానికి 'దోస్త్' డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల కిషోర్ కుమార్ తెలిపారు.

డిగ్రీ కోర్సులో దోస్త్ ద్వారా సీటు పొందండి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఇంటర్ పాసైన విద్యార్థులు తమకు నచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో, నచ్చిన కోర్సుని ఎంపిక చేసుకోవడానికి 'దోస్త్' డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల కిషోర్ కుమార్ తెలిపారు. మొదటి దశలో అడ్మిషన్ ప్రక్రియ ఈనెల 15 నుంచి మొదలై మే 7 వరకు 'దోస్త్ వెబ్ సైట్' ద్వారా ఆధార్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రెండో దశలో ఈనెల 30 నుంచి 8 వరకు మీరు ఏ కళాశాలలో ఏ కోర్సు కావాలో ఆన్ లైన్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఇస్తూ, అన్ని సర్టిఫికెట్లు జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పదో తరగతి మార్కుల మెమో పైన ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలని, అలా లేనట్లైతే, ఆధార్ కార్డులో పేరు సరిచేసుకోవాలని, డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ను జాగ్రత్తగా వివరాలు పూర్తి చేయాలని, కోర్సులు ఎంపిక చేసేటప్పుడు మీరు ఇంటర్మీడియట్ లో చదివిన కోర్సు, డిగ్రీలో ఏ ఏ కోర్సులకు అర్హతలు ఉంటాయో అలాంటి కోర్సులకు అప్లై చేసుకోవాలని ఆయన వివరించారు.


మొదటి ప్రాధాన్యత కింద మీకు నచ్చిన కోర్సులను, నచ్చిన కళాశాలను ఎంపిక చేయాలని, రెండవ, మూడవ ప్రాధాన్యతలో మిగతా కళాశాలలో, మిగతా కోర్సులను ఎంపిక చేసుకోవాలన్నారు. మీకు నచ్చిన కోర్సు గాని, కళాశాల గాని రాకుండా వేరే గ్రూప్ గనుక వస్తే, మళ్ళీ ఆఖరు సారిగా గ్రూపులను మార్పు చేసుకోవడానికి, కళాశాలలో ఉన్నటువంటి ఖాళీలను బట్టి మార్పు చేసుకోవడానికి ఉన్నత విద్యా శాఖ మండలి ఆఖరి సారిగా అవకాశం ఇస్తుందని తెలిపారు. కావునా విద్యార్థులు సమయమానం పాటించి జాగ్రత్తగా ఆన్ లైన్ లో అప్లికేషన్లు పూర్తి చేసి, కోర్సులను, కళాశాలలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిందిగా ఆయన విద్యార్దులకు సూచించారు.

Next Story