- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరస్తుల ముఠా అరెస్ట్..ఇండికా కారు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం
దిశ, వనపర్తి : నలుగురు సైబర్ నేరస్తుల ముఠా అరెస్ట్ అయిన సంఘటన వనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కృష్ణయ్య మీడియా సమావేశంలో

దిశ, వనపర్తి : నలుగురు సైబర్ నేరస్తుల ముఠా అరెస్ట్ అయిన సంఘటన వనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కృష్ణయ్య మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పోలికే పహాడ్ గ్రామానికి చెందిన కావాలి శివుడు(28) తాను సైబర్ నేరానికి గారైయ్యానని గోపాల్ పేట పోలీసు స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు చేశాడు. వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాలనుసారం కేసు నమోదు చేసిన పోలీసులు వనపర్తి జిల్లా సైబర్ క్రైమ్, గోపాల్ పేట పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. ధర్యాప్తు లో భాగంగా మహబూబ్ నాగర్ జిల్లా, మూసాపేట మండలం,సూర్తి తాండాకుచెందిన ఏ1-వడ్డెరనాగరాజు(25), ఏ2-వడ్డెర శివకుమార్(36), ఏ3-వడ్డెర రాజు(38), కూనిపల్లి తాండా కు చెందిన ఏ4-వడ్డెర గోపాల్(41) నకిలీ వెబ్‌సైట్‌లు, క్యూ అర్ కోడ్‌లు, ఫోన్‌పే ద్వారా ఇన్స్యూరెన్స్, జీ.ఎస్.టి,టీ.డీ.ఎస్ రీఫండ్‌ల పేరిట మోసాలకు పాల్పడ్డారని తమ విచారణలో ఒప్పుకున్నారని సీఐ వెల్లడించారు.






