కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : సీఐటీయూ

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సిఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రకాంత్, టౌన్ కన్వీనర్ రాజ్ కుమార్ లు డిమాండ్ చేశారు.

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి : సీఐటీయూ
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సిఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రకాంత్, టౌన్ కన్వీనర్ రాజ్ కుమార్ లు డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కార్మిక హక్కులను కాలరాచి నాలుగు లేబర్ కోడ్స్ అప్రజాస్వామికంగా నోటిఫై చేసి శనివారం నుండి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఏకపక్షంగా ప్రకటించడంతో బీజేపీ కార్మిక వ్యతిరేక చర్యలను చేపట్టిందని వారు విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఈనెల 26 న దేశ వ్యాప్తంగా జిల్లా,మండల కేంద్రాలలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిఐటీయూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎర్ర నర్సింహులు, ప్రభాకర్ లు హెచ్చరించారు.

Next Story