- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వక్ఫ్ కమిటీ మాజీ కార్యదర్శి రఫీయోద్దీన్ కన్నుమూత
దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన కాంప్లెక్స్ కమిటీ మాజీ కార్యదర్శి, పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం సీనియర్ నాయకుడు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ రఫీయోద్దీన్ గురువారం

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన కాంప్లెక్స్ కమిటీ మాజీ కార్యదర్శి, పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం సీనియర్ నాయకుడు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ రఫీయోద్దీన్ గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె సంబంధిత ఆపరేషన్ అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. సయ్యద్ రఫీయోద్దీన్ ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని, విద్యా రంగానికి విశేష సేవలు అందించారు. ప్రస్తుతం అరబ్బీ పాఠశాల మదర్సా ఇస్లామీయ ఫజల్ ఉల్ ఉలూం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నాగర్ కర్నూల్ వక్ఫ్ బోర్డు కార్యదర్శిగా కూడా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మరణం పట్ల పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయ సంఘ నేతలు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యాభిమానులు, విద్యార్థులు, పట్టణంలోని ఉపాధ్యాయ సంఘ నాయకులు, మత పెద్దలు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.






