బీసీ బంద్ కు సహకరించండి : మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య

by Ratna Kumari |

దిశ, మిడ్జిల్ : రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం హర్షినియమని మిడ్జిల్ మాజీ

బీసీ బంద్ కు సహకరించండి :  మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య
X

దిశ, మిడ్జిల్ : రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం హర్షినియమని మిడ్జిల్ మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య తెలిపారు. గురువారం మండల కేంద్రంలో విలేకర్ల తో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం పట్ల బీసీ వ్యతిరేకులు అనుసరిస్తున్న విధానాలకు కొన్ని రాజకీయ పక్షాలు పరోక్షంగా మద్దతు పలకడం సిగ్గుచేటు అన్నారు. స్వతంత్ర భారతంలో బీసీ జనాభా లెక్క జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం పట్ల కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. దీనిపై బీసీ సంఘాలు ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం అభినందనీయమన్నారు. మిలియన్ మార్చ్ తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడవలసిన అవసరం అన్ని కుల సంఘాలకు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉందని చెప్పడం అభినందనీయమని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టుదలతో ఉన్నారు అని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసంసాధన కోసం జరుగుతున్న పోరాటంలో సమిష్టి కృషి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ , అద్దంకి దయాకర్ ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న ప్రణాళిక బద్ధమైన చర్యలకు బీసీ సంఘాలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలు అందరూ సహకరించాలని కోరారు.

Next Story