- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి మృతి
నాగర్ కర్నూల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జె.రామచంద్రారెడ్డి అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు.

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జె.రామచంద్రారెడ్డి అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. విద్యాశాఖలో వివిధ హోదాల్లో సేవలందించారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తూ విద్యా రంగానికి విశేష సేవలు అందించారు. ఆపస్ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరిగా నిలిచారు. అంతేకాకుండా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా పని చేసి సమాజ సేవకుడిగా మంచి పేరు పొందారు. ఆయన మృతి పట్ల తెలంగాణ విశ్రాంత ఉద్యోగ సంఘం జిల్లా శాఖ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్జీఆర్ఈఏ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






