అనారోగ్యంతో మాజీ ఎంపీపీ మృతి

by velandi.Saikiran |

తెల్ల రాళ్లపల్లి గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ముంత రాములు యాదవ్ (88) అనారోగ్యంతో సోమవారం మృతి

అనారోగ్యంతో మాజీ ఎంపీపీ మృతి
X

దిశ, పాన్ గల్: తెల్ల రాళ్లపల్లి గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ముంత రాములు యాదవ్ (88) అనారోగ్యంతో సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ముంత రాములు యాదవ్ అని మండల వాసులు కొనియాడారు. 2001 నుంచి 2006 వరకు మండల పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కొంతసేపటికి క్రితం తుది శ్వాస విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు,.

Next Story