ప్ర‌జ‌లు బీఆర్ఎస్ ను కోరుకుంటున్నారు : మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ, మిడ్జిల్ : ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ప్రజలు బీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇచ్చిన అభ్య‌ర్థుల‌ను అధిక సంఖ్య‌లో

ప్ర‌జ‌లు బీఆర్ఎస్ ను కోరుకుంటున్నారు :  మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మిడ్జిల్ : ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ప్రజలు బీఆర్ఎస్ మ‌ద్ద‌తు ఇచ్చిన అభ్య‌ర్థుల‌ను అధిక సంఖ్య‌లో గెలిపించుకున్నార‌ని.. మ‌ళ్లీ కేసీఆర్ ప్ర‌భుత్వం రావాల‌ని కోరుకుంటున్నార‌ని మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని వేముల గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ నాగమ్మ ఆంజనేయులు ఏర్పాటు చేసిన అభినందన సభల్లో పాల్గొని మాట్లాడారు. రానున్న ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు బీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని అన్నారు. గెలిచిన సర్పంచులను, వార్డు సభ్యులను మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి శాలువాలతో సన్మానించారు . పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలను నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్, మాజీ జడ్పీటీసీ శశిరేఖా బాలు, వేముల సర్పంచ్ నాగమ్మ ఆంజనేయులు, దోనూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు జంగారెడ్డి, చంద్రయ్య గౌడ్, శ్రీనివాసులు, బంగారు, భీమ్ రాజు, శ్యామ్ , మతీన్, యాదయ్య,నవీన్ చారి, సుకుమార్, నర్సింలు, నరేష్, ఉదయ్ కుమార్ ఉన్నారు.

Next Story